వేములవాడ రాజన్న దర్శనానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. హాజరుకావాలని జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పిలుపు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు ఈనెల 6వ తేదీన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత రానున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అదే రోజు వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సనుగుల గ్రామంలో నిర్వహించనున్న అమరవీరుల స్మారక సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లాకు చెందిన తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు అందరూ పెద్ద సంఖ్యలో విధిగా హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్...