రాష్ట్రంలో తీవ్ర కరువు సీఎం అచేతన స్థితిలో ఉన్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ముఖ్యమంత్రి అచేతన స్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు. కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వరుణయాగం చేసి ప్రజల ఖర్మ అన్నట్లుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో ఆమె లేవనెత్తిన ప్రధానాంశాలు క్రింది విధంగా ఉన్నాయి: తీవ్ర కరువులో రాష్ట్రం.. వెంటనే ప్రత్యేక కేబినెట్ సమావేశం కావాలి: రాష్ట్రవ్యాప్తంగా కరువు తాండవిస్తోందని, భూగర్భ జలాలు కొన్ని చోట్లలో 20 మీటర్ల లోతుకు పడిపోయాయని ఆందోళన...