అనారోగ్యంతో చికిత్స పొందుతున్న యువకుడికి రూ.8 లక్షల ఎల్ఓసీ
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న యువకుడికి రూ.8 లక్షల ఎల్ఓసీ బోయినపల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి: మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన చిన్న మాధవుని కృష్ణంరాజు, విద్యాసాగర్ కుమారుడు, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వెంకట్రావుపల్లి సర్పంచ్ సంధ్య మహేందర్, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం కృష్ణంరాజు వైద్య ఖర్చుల కోసం రూ.8 లక్షల విలువైన ఎల్ఓసీ (LOC) లెటర్‌ను మంజూరు చేయించారు. ఎమ్మెల్యే స్పందించి ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడంపై కృష్ణంరాజు కుటుంబ సభ్యులు, వెంకట్రావుపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం...