తెలంగాణలో నకిలీ ఓటర్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం సీరియస్.. తప్పుడు వివరాలిచ్చిన వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశం!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: రాష్ట్రంలో ఎస్ఐఆర్ (SIR-2026) ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పెద్ద సంఖ్యలో వస్తున్న నకిలీ దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు లేదా అక్రమంగా మార్పులు చేసేందుకు భారీగా వస్తున్న 'ఫారమ్-7' (Form-7) నకిలీ దరఖాస్తులను గుర్తించిన ఈసీ, తప్పుడు వివరాలు సమర్పించి మోసానికి పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. భారీగా ఫారమ్-7 నకిలీ దరఖాస్తుల గుర్తింపు: రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా పరిశీలన సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో పెద్ద ఎత్తున ఫారమ్-7 దరఖాస్తులను దాఖలు చేసినట్లు ఎన్నికల సంఘం విచారణలో తేలింది. ఎలాంటి...