బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గుగులోతు విజయదేవికి యాదగిరి సునీల్ రావు సన్మానం, శుభాకాంక్షలు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా (State Executive Member) నూతనంగా నియమితులైన గుగులోతు విజయ దేవిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరియు ఎస్టీ మోర్చా బలోపేతానికి ఆమె శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...