రూ. 15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కారోబార్ అరెస్ట్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: సిద్దిపేట జిల్లాలో అవినీతి అధికారులపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఇంటి మ్యూటేషన్ దరఖాస్తును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపేందుకు రూ. 15 వేలు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కారోబార్ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కారు. ​ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బి. అరుణ విధులు నిర్వర్తిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పేరు మీద ఉన్న రెండు ఇళ్లకు సంబంధించి మ్యూటేషన్ (Mutation) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును...