సిరిసిల్ల రైల్వే లైన్ సాధన కోసం ఉధృత పోరాటం చేస్తాం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ సిరిసిల్ల మరియు సిద్ధిపేట నుంచి జనగాం వరకు రైల్వే లైన్ సాధించాలన్నది ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అని, అయితే దీని గురించి మాట్లాడే దిక్కు బలమైన ప్రజాప్రతినిధులు కరవయ్యారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన నాయకులు మౌనం వహించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే లైన్ సాధన కోసం తమ పార్టీ తరఫున కచ్చితంగా తీవ్రంగా ప్రయత్నిస్తామని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. ఇదే సమయంలో నేషనల్ హైవే పనులు కూడా...