రైస్‌మిల్లులో షార్ట్ సర్క్యూట్ ధాన్యం దగ్ధం.. రూ.20 లక్షల నష్టం

పెద్దపల్లి జిల్లా తెలంగాణ అడ్డా ప్రతినిధి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి శివారులోని సదాలక్ష్మి రైస్‌మిల్లులో మంగళవారం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో డ్రైయర్‌తో పాటు అందులో ఉన్న ధాన్యం దగ్ధమ‌యింది.దీంతో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు మిల్లు యజమాని పరిపాటి తిరుపతిరెడ్డి తెలిపారు. ఉదయం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హమాలీలు, గుమస్తాలు అప్రమత్తమై యజమానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న యజమాని, కార్మికులు మిల్లులోని బోర్‌ నీటితో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మంటలు భారీగా చెల‌రేగ‌డంతో ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను...