రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
వేములవాడ తెలంగాణ అడ్డా ప్రతినిధి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం తదితర నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, సంబంధిత అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీనివాసులు అధికారులతో...