సిద్దిపేటలో త్వరలోనే భారీ బహిరంగ సభ, పార్టీ కార్యాలయం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ సిద్దిపేట పట్టణంలోని శివాజీ నగర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యక్తిగత కార్యదర్శి (PA) వెంకటనారాయణను తెలంగాణ రక్షణ సేన చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకటనారాయణను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేట రాజకీయాలపై కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు: సిద్దిపేట మా సొంతింటి లాంటిది: "సిద్దిపేట నాకు అమ్మగారి ఇల్లు లాంటిది. ఇక్కడికి నేను ఎప్పుడైనా వస్తుంటాను, వెళ్తుంటాను. వెంకటనారాయణ గారు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు," అని కవిత ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. భారీ...