కరీంనగర్, సిద్దిపేటలో కోనోకార్పస్ చెట్లను సమూలంగా తొలగించాలి హైకోర్టు సంచలన ఆదేశాలు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్న ప్రమాదకరమైన కోనోకార్పస్ (Conocarpus) చెట్లపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తీవ్రమైన విషవాయువులను విడుదల చేస్తూ, పర్యావరణానికి, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ చెట్లను కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో వెంటనే సమూలంగా తొలగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల పాలిట మరణ శాసనంగా మారిన ఈ కోనోకార్పస్ చెట్ల తొలగింపుపై కోర్టు ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్న కోనోకార్పస్: పట్టణాల సుందరీకరణ పేరిట గతంలో విరివిగా నాటిన కోనోకార్పస్ చెట్లు ప్రస్తుతం ప్రజల ఆరోగ్యానికి...