ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించిన 'అల్ఫోర్స్' డా. వి. నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ సమాజ సేవలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాత్ర అత్యంత ప్రశంసనీయమని, ఈ సంస్థ అందిస్తున్న సేవలతో సమాజంలో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, 'అల్ఫోర్స్' విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి కొనియాడారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో కరీంనగర్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులను డా. నరేందర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్కారం...