సైబర్ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు, 101 మంది అరెస్ట్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సైబర్ మోసాలపై ఉక్కుపాదం మోపుతూ, తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ భారీ ఆపరేషన్‌లో మొత్తం 101 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ​అరెస్టుల వివరాలు: పట్టుబడిన 101 మందిలో 18 మంది మహిళలు ఉండగా, 83 మంది పురుషులు ఉన్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో విస్తృతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ ద్వారా దేశవ్యాప్తంగా నమోదైన ఏకంగా 1,172 సైబర్ క్రైమ్...