హైదరాబాద్ దారుస్సలామ్‌లో AIMIM కరీంనగర్ జమాత్ కీలక సమావేశం నూతన టౌన్ బాడీ నియామకాలు మరియు బాధ్యతల కేటాయింపు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ హైదరాబాద్‌లోని దారుస్సలామ్‌లో పార్టీ అధినేత, నాకీబ్-ఎ-మిల్లత్ బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో కరీంనగర్ జమాత్‌కు సంబంధించి అత్యంత కీలకమైన సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ నూతనంగా ఎన్నికైన కరీంనగర్ టౌన్ బాడీ బాధ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జమాత్‌ను మరింత బలోపేతం చేయడానికి, సంస్థాగతంగా కష్టపడటానికి మరియు ప్రజల మధ్యనే ఉంటూ పార్టీ కార్యకలాపాలను మరింత మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ బాడీ వివరాలు: బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ మార్గదర్శకత్వంలో, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని (66) డివిజన్లలో జమాత్ కార్యకలాపాలు టౌన్ బాడీ ఆధ్వర్యంలో...