కరీంనగర్ జిల్లాను పూర్తి టీబీ రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేద్దాం యాదగిరి సునీల్ రావు
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 'టీబీ ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా జోష్ శుభారంభ సభ నిర్వహించబడింది. టీబీ రహిత తెలంగాణకై మరో అడుగు ముందుకు అనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. గతంలో క్షయ (టీబీ) వ్యాధి బారిన పడిన వారిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివక్షతో చూసేవారని, వారి పట్ల భయాందోళనలు వ్యక్తమవుతుండేవని గుర్తుచేశారు. సరైన అవగాహన లేకపోవడం...