ఎగ్లాస్పూర్ పంచాయతీ నిధులపై విచారణ జరపాలి

కలెక్టర్‌కు 6వ వార్డు సభ్యుడు అక్కనపెల్లి సురేష్ ఫిర్యాదు తెలంగాణ అడ్డా కొనరవుపేట ప్రతినిధి : సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామపంచాయతీ నిధుల వినియోగం, సీసీ రోడ్ల నిర్మాణ పనులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ 6వ వార్డు సభ్యుడు అక్కనపెల్లి సురేష్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీ అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలు, మంజూరైన నిధులు, ఖర్చు వివరాలు, బిల్లులు, పనుల ప్రస్తుత స్థితిగతులను పరిశీలించాలని ఆయన కోరారు. సీసీ రోడ్ల పనులపై ప్రశ్నించానని వెల్లడి ఈ నెల 2న ఎగ్లాస్పూర్ గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభకు తాను వార్డు సభ్యుడిగా హాజరైనట్లు సురేష్ తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి...