ఫారం-7 దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి అవకతవకలకు తావుకూడదు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఎంఐఎం నేతలు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముద్రిత ఫారం-7 అభ్యంతర పత్రాల పెద్దఎత్తున దాఖలవుతున్న వైనంపై సమగ్ర మరియు పారదర్శక పరిశీలన జరపాలని కోరుతూ ఎంఐఎం నాయకులు జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏఐఎంఐఎం కరీంనగర్ జాయింట్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులామ్ అహ్మద్ హుస్సేన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఈ వినతిపత్రం సమర్పించినట్లు వారు తెలిపారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా.. ఇప్పటికే ఉన్న ఓటర్లను తొలగించే దుద్దేశంతో...