కరీంనగర్ ఏఐఎంఐఎం (AIMIM) నూతన టౌన్ అధ్యక్షుడిగా మహమ్మద్ అతిఫ్ (అథినా) నియామకం.. మత సామరస్యమే మా ధ్యేయమన్న నూతన అధ్యక్షుడు
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ జాతీయ అధ్యక్షులు, అల్-హాజ్ బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ గురువారం కరీంనగర్ నూతన టౌన్ అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు (జాయింట్ సెక్రటరీలు), కోశాధికారి మరియు ఇతర కార్యవర్గ సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు మహమ్మద్ అతిఫ్ (అథినా) మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ టౌన్ అంతటా ఏఐఎంఐఎం పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ముందుకు తీసుకెళ్లేందుకు అంకితభావంతో కృషి చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 66 డివిజన్లలోని ప్రస్తుత డివిజన్ అధ్యక్షులందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం కమిటీలు లేని...