మార్గదర్శి విద్యానికేతన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు మూడు మీటర్ల ఎత్తైన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు

సాంప్రదాయబద్ధంగా బతుకమ్మకు పూజలు పాల్గొన్న కరస్పాండెంట్ మండల చిరంజీవి ఉపాధ్యాయులు తెలంగాణ అడ్డా ప్రతినిధి: మార్గదర్శి విద్యానికేతన్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సుమారు మూడు మీటర్ల ఎత్తైన భారీ బతుకమ్మను రంగురంగుల పూలతో అందంగా పేర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మ చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతను, ప్రకృతి ప్రేమను చాటిచెప్పే బతుకమ్మ పాటలు ఆలపిస్తూ పండుగ వైభవాన్ని చాటారు. పూలతో అలంకరించిన భారీ బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల...