‘రాజీవ్‌చౌక్’ విజిలెన్స్ విచారణ డిమాండ్ పై కక్షసాధింపు తగదు ‘తెలంగాణ అడ్డ’ స్పష్టత!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ కరీంనగర్ నగరంలోని ‘రాజీవ్‌చౌక్’ పనుల్లో భాగంగా అమర్చిన ఫౌంటెన్ పైపు ఊడిపోయిన ఉదంతంపై మరియు అక్కడ జరిగిన పనుల నాణ్యతపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 'తెలంగాణ అడ్డ' దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ప్రజాధనం సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో, ఆ పనులపై విజిలెన్స్ అధికారులతో సమగ్ర ఎంక్వైరీ జరిపించాలని మాత్రమే మేము డిమాండ్ చేశాం తప్ప, ఎవరిపైనా నేరుగా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. మేము వార్త ప్రచురించిన తర్వాతే సంబంధిత అధికారులు స్పందించి ఆ ఊడిపోయిన పైపును తిరిగి పునరుద్ధరించారనేది అక్షర సత్యం. వాస్తవాలు ఇలా ఉంటే.. పత్రికా విలువలను దెబ్బతీసేలా, నిజాలను తొక్కిపెట్టేలా మాజీ సుడా (SUDA) చైర్మన్...