అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా 'సద్దుల బతుకమ్మ' వేడుకలు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు ప్రతీక అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ మైదానంలో 'అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ & కాలేజెస్' ఆధ్వర్యంలో 'సద్దుల బతుకమ్మ' ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తమ సతీమణి డాక్టర్ వి.వనజా నరేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మైదానంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఆనందోత్సాహాల మధ్య ఉత్సవాల నిర్వహణ: ఈ సందర్భంగా డాక్టర్...