ఫ్యూచర్ జనరేషన్‌కు మన పండుగలు, సంస్కృతిని అందించాల్సిన బాధ్యత మనదే తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ మన పండుగలను, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు (ఫ్యూచర్ జనరేషన్‌కు) అందించాల్సిన గురుతర బాధ్యత మన అందరిపై ఉందని తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హస్తినాపురంలోని డీఆర్డీఎల్ కాలనీవాసులతో కలిసి నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పండుగ మన గుర్తింపు: ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా 'బతుకమ్మ పండుగ మనది' అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా నేటి యువత బతుకమ్మ పాటలను నేర్చుకోవాలని, ఒక్కసారి పాట నేర్చుకుంటే అది తరతరాల పాటు వందేళ్ల...