రైతు పట్ల నిర్దయగా ప్రవర్తించిన గజ్వేల్ తహశీల్దార్ స్వామి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన సిద్దిపేట కలెక్టర్ హైమావతి!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ సిద్దిపేట / గజ్వేల్ వ్యవసాయ భూమి, జీవనోపాధి సమస్యపై న్యాయం కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్న ఒక బాధిత రైతు పట్ల అత్యంత నిర్దయగా, అవహేళనగా ప్రవర్తించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ చిట్టంపల్లి స్వామిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆర్డీవో (RDO) ఇచ్చిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ కె. హైమావతి ఆయనను సస్పెండ్ చేస్తూ శనివారం అర్ధరాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 'పురుగుల మందు తాగలేదా' అంటూ అవహేళన: భూ సమస్య పరిష్కారం కోసం తన వద్దకు వచ్చిన రైతును ఉద్దేశించి "నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.. ఇంకా బతికే...