ఓటరు సమగ్ర సవరణ (SIR)పై ప్రతిపక్షాలది అసత్య ప్రచారం.. స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓటరు సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పకడ్బందీగా ఓటరు జాబితా నమోదు: దేశంలో దాదాపు 95 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇందులో 82 కోట్ల మంది ఓటర్లు అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని కొత్త జాబితాలో ఎన్‌రోల్...