ఈనెల 17న పద్మనగర్లో టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల ప్రారంభం స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ కరీంనగర్ నగరంలోని పద్మనగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులు ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీటీడీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పద్మనగర్లోని శ్రీవారి ఆలయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు, సాంకేతిక అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కేసీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ప్రాజెక్ట్: ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక...