నేను గెలిస్తే పార్టీ గెలిచినట్లే.. నేను ఓడితే పార్టీ ఓడినట్లే..
మూడవసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించేది కేసీఆరే. యువకులే కథానాయకులు కావాలి. ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయండి...ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా నేను గెలిస్తే పార్టీ గెలిచినట్లే, నేను ఓడిపోతే పార్టీ ఓడినట్లే అని ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మణుగూరు పట్టణం లోని హనుమాన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన పినపాక నియోజకవర్గం సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా...