వాస్తవాలు రాస్తే.. కక్షసాధింపులా?
రాజీవ్ చౌక్ కథనంతో 'తెలంగాణ అడ్డ'పై ఎదురుదాడి మరమ్మతులు నిజమైతే.. మా వార్త తప్పెలా అయింది? ప్రశ్నిస్తే పోలీస్ కేసులు.. నోటీసులతో బెదిరింపులా? మీడియా గొంతు నొక్కే పన్నాగంపై 'తెలంగాణ అడ్డ' ప్రత్యేక కథనాలు కరీంనగర్ బ్యూరో, తెలంగాణ అడ్డ: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా రంగం ప్రజల పక్షాన నిలబడి నిగ్గుతేల్చే వాస్తవాలు కొందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రజాధనాన్ని కాజేసే నాసిరకం పనులను, అధికారిక నిధుల వ్యయం వెనుక దాగి ఉన్న లొసుగులను బహిర్గతం చేస్తే, దిద్దు బాటు చర్యలు చేపట్టాల్సింది పోయి, ఎదురుదాడికి దిగే సరికొత్త సంస్కృతి కరీంనగర్లో తెరపైకి వచ్చింది. ఒక ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చినందుకు అధికార శక్తులు...