జ్యోతిష్మతి చైర్మన్ సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!
కరీంనగర్ బ్యూరో , తెలంగాణ అడ్డ నుస్తులాపూర్ లో రూ. 100 కోట్ల దళితుల అసైన్డ్ భూమి కబ్జా? ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఏఐఎఫ్బీ ఫిర్యాదు రేపు ఉదయం 11 గంటలకు చర్చలకు ఆహ్వానించిన కలెక్టర్ కరీంనగర్ (తెలంగాణ అడ్డ): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 574 పరిధిలో గల సుమారు 15 ఎకరాల 09 గుంటల దళితుల అసైన్డ్ భూమిని జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జె. సాగర్ రావు ఆక్రమించుకున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) జిల్లా నాయకులు ఆరోపించారు. సుమారు రూ. 100 కోట్ల విలువైన ఈ భూమిని కాపాడి, అసలైన ఎస్సీ లబ్ధిదారులకు అప్పగించాలని...