ఆల్ఫోర్స్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి
తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ సంబరాలు తెలంగాణ అడ్డా ప్రతినిధి పెద్దపల్లి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆడపడుచులకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుక గొప్పదని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజిస్తూ జరుపుకునే బతుకమ్మ పండుగ మన సాంప్రదాయాలకు ప్రతిబింబమని అన్నారు. పలు రకాల పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుకునే ఆనందంగా జరుపుకునే ఈ పండగ తెలంగాణ ప్రజల జీవనశైలిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. సామాజిక ఐక్యతను...