రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాల్సిందే!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) కార్యాలయం ముట్టడి, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ధర్నా పంటలు ఎండిపోకుండా తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) కార్యాలయం ఎదుట భారీ ధర్నా మరియు ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. హామీలు అమలు చేయాలి. రైతుల పంటలను కాపాడాలి: ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్...