ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు – నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ కింద సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కరీంనగర్‌లో ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని మాట్లాడారు. కరోనా కష్టకాలంలో సేవ...