జర్నలిస్టులపై పోలీసుల అణచివేత దారుణం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విలేకరుల పరామర్శ
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీసుల చిత్రహింసలపై తీవ్ర ఆగ్రహం బాధితులను పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన, పార్టీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో విలేకరులుగా విధులు నిర్వర్తిస్తున్న పొత్తూరి శేఖర్ మరియు రాతిపల్లి సంపత్‌లను పోలీసులు అన్యాయంగా చిత్రహింసలకు గురి చేయడం అత్యంత దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. పోలీసుల దౌర్జన్యంతో తీవ్ర గాయాలపాలై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్న ఆ జర్నలిస్టులను గురువారం తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ గారి ఆదేశానుసారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. పరామర్శించిన ప్రముఖులు:...