కోట్ల రూపాయలతో ఇందిరా చౌక్ అభివృద్ధి కానీ ఈ నీటి ఫౌంటెన్ పనిచేయకపోవడానికి కారణమేంటి?

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: నిలిచిపోయిన నీటి కారంజాలు, వెలగని లైట్లతో వెలవెలబోతున్న నగర కూడలి అధికారుల నిర్లక్ష్యమా? మెయింటెనెన్స్ వైఫల్యమా? – ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తి తక్షణమే విచారణ జరిపి ఫౌంటెన్‌ను పునరుద్ధరించాలని మున్సిపల్ కమిషనర్‌కు విజ్ఞప్తి కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ పథకం కింద కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఇందిరా చౌక్ (తెలంగాణ చౌక్) కూడలిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గతంలో అందమైన గార్డెన్ రూపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఆధునీకరించి, నగరానికే తలమానికగా నిలిచేలా నీటి ఫౌంటెన్‌ను నిర్మించారు. అయితే కోట్ల రూపాయల నిధులు వెచ్చించి చేపట్టిన ఈ అభివృద్ధి పనుల్లో రూపుదిద్దుకున్న నీటి ఫౌంటెన్ ప్రస్తుతం...