కరువు నివారణలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన విమర్శలు
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం రైతు కూలీలకు రూ. 12 వేల ఆర్థిక సహాయం, లైఫ్ ఇన్సూరెన్స్ అందించాలని డిమాండ్ రాష్ట్రంలో తలెత్తిన తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొవడంలో మరియు ముందస్తు చర్యలు చేపట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ ఏడాది జనవరిలోనే ఎల్ నినో పరిస్థితులు ఉంటాయని ప్రపంచం మొత్తం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అప్పటి నుంచి ప్రభుత్వం ఎందుకు చర్యలు...