నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపే వాళ్ళ పై ప్రత్యేక రంగు బోర్డుల ప్రదర్శన చట్టం అందరికీ సమానమేనా?
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలకు చట్టపరమైన చర్యలేవి? అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి? మోటార్ వాహనాల చట్టం నిబంధనలు ఇవే సామాన్యులకు ఒక న్యాయం, నాయకులకు మరో న్యాయమా? భారత రాజ్యాంగం దృష్టిలో చట్టం ముందు అందరూ సమానులే. దేశాన్ని నడిపించే చట్టాలు, నిబంధనలు సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నవారందరికీ సమానంగా వర్తించాలి. కానీ, ఆచరణలో మాత్రం నిబంధనల అమలులో పక్షపాత ధోరణి కనిపిస్తుందనే విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామినేటెడ్ పదవులు పూర్తయిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికీ తమ వాహనాలకు సరైన నంబర్ ప్లేట్లకు బదులుగా హోదాలు...