మానస పిల్లల ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టాలి.. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్
రాజన్న సిరిసిల్ల తెలంగాణ అడ్డా ప్రతినిధి వైద్యం పేరుతో పేద ప్రజలపై అధిక బిల్లుల భారం మోపుతున్నారనే ఆరోపణలపై మానస పిల్లల ఆసుపత్రిపై విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు, అగ్నిమాపక భద్రత, ఇతర వైద్య ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారులు తనిఖీలు చేపట్టాలని కోరారు. ఆసుపత్రుల్లో ధరల పట్టికలు ప్రదర్శించడం లేదని, రోగులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని...