నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: పూల పండుగను కోలాహలంగా జరుపుకున్న మున్సిపల్ అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్న మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం నాడు అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో మున్సిపల్ సిబ్బంది, మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి కార్యాలయ ప్రాంగణంలో శోభాయమానంగా కొలువుదీర్చారు. ఈ వేడుకల్లో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్,...