జర్నలిస్టులపై దాడికి పాల్పడిన ఎస్‌ఐని సర్వీసు నుంచి తొలగించాలి కొంకటి శేఖర్ డిమాండ్.. బాధిత జర్నలిస్టులకు పరామర్శ
తెలంగాణ అడ్డా కరీంనగర్ బ్యూరో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎకదం న్యూస్ ఎడిటర్, జర్నలిస్టులు పొత్తూరి శేఖర్, రాతిపల్లి సంపత్‌లను బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొంకటి శేఖర్ శనివారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. నిజాన్ని నిర్భయంగా వార్తల రూపంలో ప్రజలకు అందించినందుకే జర్నలిస్టులపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. బాధిత జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కొంకటి శేఖర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి, నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని...