రైతుల విద్యుత్, సాగునీటి సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ డిమాండ్
రాఘవపూర్ సబ్స్టేషన్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 17 తెలంగాణ అడ్డా రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీటిని సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతులు పెద్దపల్లి మండలం రాఘవపూర్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర శాఖ, కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ, పెద్దపల్లి జిల్లా శాఖ పిలుపు మేరకు శనివారం ఉదయం నిర్వహించిన ఈ ధర్నాలో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా...