కీసర మాజీ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ. 2.28 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ​ఏకకాలంలో బంధువులు, బినామీల ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ​లంచం కేసులో ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉన్న ఆంజనేయులుపై పీటీ వారెంట్‌తో విచారణ మేడ్చల్-మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. శనివారం ఏసీబీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ​ఈ సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలు: ​సరూర్ నగర్, ఎల్బీనగర్, పేరూరులలో ఇళ్లు మరియు ప్లాట్లు గుర్తింపు. ​మిర్యాలగూడ హాలియాలో 2 ఎకరాల వ్యవసాయ భూమి స్వాధీనం. ​రూ. 7 లక్షల నగదు, 60...