ఈ నెల 23న రైతాంగ సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తిమ్మాపూర్‌లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో దిశానిర్దేశం భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కరీంనగర్లోని తిమ్మాపూర్ మండలంలో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23వ తేదీన రైతాంగ సమస్యలపై చేపట్టనున్న కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు....