పండుగ వేళ ఆర్టీసీ అడ్డగోలు ఛార్జీల పెంపు ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు రూ. 400కు టికెట్ ధర పెంపు వాస్తవమే! పెంచిన అడ్డగోలు ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి, టికెట్ ధరలను భారీగా పెంచి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పండుగల పేరుతో రెగ్యులర్ బస్సులను తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తమవుతోంది. ఛార్జీల పెంపు వాస్తవమేనా? ఆర్టీసీ ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు పెంచడానికి నిబంధనల ప్రకారం ఎలాంటి అవకాశం లేదు. అయితే పండుగలు (దసరా,...