బోయినిపల్లి, దేశాయిపల్లి ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

>పండగను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం >ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు >కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అడ్డా బోయినపల్లి బోయినిపల్లి, దేశాయిపల్లి గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మన రాష్ట్ర ప్రత్యేకతను, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతుందని అన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ...