బోయినిపల్లి, అనంతపల్లి ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాగిరి వెంకటేష్ బోయిన్పల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయినిపల్లి మరియు అనంతపల్లి గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాగిరి వెంకటేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మన రాష్ట్ర ప్రత్యేకతను, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతుందని అన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపుతుందని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా...