ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గించడం అన్యాయం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కేంద్రం నిధులు ఇచ్చినా వేతనాల్లో కోతలు పెట్టడం సరికాదు దేశంలోని ఏడు రాష్ట్రాలు ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేశాయి నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 1195 తేవడం అన్యాయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ నాయకులతో కలిసి బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. జీతాల్లో కోతలు - వివక్ష: రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది ఉద్యోగులుంటే వారిలో కొంతమంది వేతనాలు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు తగ్గించారని, మరికొందరి వేతనాలు...