మానకొండూర్ మండలం వన్నారంలో ఉద్రిక్తత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బుద్ధుడి చిత్రపటాలు ఉన్న సూచిక బోర్డు ధ్వంసం!
మహారాజుల కాలనీ సూచిక బోర్డును మరుగు కాలువలో పడేసి అవమానించిన వైనం కులవివక్షకు పాల్పడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ యువజన సంఘం ఆగ్రహం మానకొండూర్ మండలంలోని వన్నారం గ్రామం నది ఒడ్డులోని భూలక్ష్మి చౌరస్తా దగ్గర ఉన్న మహారాజుల కాలనీ సూచిక బోర్డును అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అత్యంత పాశవికంగా తొలగించి మరుగు కాలువలో పడవేసి తొక్కడం తీవ్ర కలకలం రేపింది. ఆ సూచిక బోర్డు పైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మరియు బుద్ధుని ఫోటో చిహ్నాలు ఉండగా, వాటిని కింద పడవేసి అగౌరవపరిచారని గ్రామ యువజన సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా...