రత్నంపేటలో రంగు రంగుల లైట్లతో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక శోభ.

సర్పంచ్ కౌడగాని వెంకటేష్ మరియు గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో మునుపేన్నడు లేనివిధంగా విద్యుత్ దీపాల తో అలంకరణ తెలంగాణ అడ్డా బోయిన్పల్లి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని గ్రామ సర్పంచ్‌ డా. కౌడగాని వెంకటేష్‌ ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బతుకమ్మలు ఆడే ప్రాంగణాన్ని మునుపెన్నడూ లేని విధంగా రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించి, పండుగ వాతావరణానికి మరింత శోభను తీసుకొచ్చారు. విద్యుత్‌ దీపాల వెలుగులతో బతుకమ్మ ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, ఆడపడుచులు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేలా గ్రామ పాలకవర్గం అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. పండుగకు వచ్చే...