బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: వివిధ గ్రామాల్లో పర్యటించి తెలంగాణ ఆడపడుచులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గన్నేరువరం, మానకొండూరు మండలాల్లో ఘనంగా పూల పండుగ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం పాల్గొని సందడి చేశారు. వివిధ గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు హాజరై మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గుండ్లపల్లి మరియు జంగపల్లి పర్యటన: గన్నేరువరం మండల పరిధిలోని గుండ్లపల్లి ఎక్స్‌రోడ్డులో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మహిళలతో ముచ్చటించారు. అనంతరం జంగపల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న దుర్గాదేవి...