ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీక బతుకమ్మ: బ్రహ్మశ్రీ పాములపర్తి వేణుగోపాల చారి
వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ప్రకృతిని పూజిద్దాం విశిష్ట సాంస్కృతిని కాపాడదాం తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో రామ్ నగర్ ప్రగతి నగర్ లో వెళ్లివేసిన ఆధ్యాత్మిక శోభ తీరక్క పువ్వులతో గౌరమ్మను కొలిచి రాష్ట్ర శ్రేయస్సును ఆకాంక్షిస్తూ మహిళలు ప్రార్థనలు సాంప్రదాయ వస్త్రధారణతో తరలివచ్చి బతుకమ్మ సంబరాలు అలరించిన మహిళామణులు తెలంగాణ అడ్డా ప్రతినిధి కరీంనగర్ బ్యూరో: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్ జిల్లాలోని రాంనగర్, ప్రగతి నగర్ పరిసరాల్లో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగాయి. ఆదివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో...