బూరుగుపల్లిలో పూల సంబురం.. ఘనంగా బతుకమ్మ వేడుకలు విజయ్ నగర్ కాలనీలో ఆటపాటలతో హోరెత్తించిన ఆడపడుచులు

రంగురంగుల పూలతో ఒద్దికగా తీర్చిదిద్దిన బతుకమ్మలు ఆకట్టుకున్న ప్రత్యేక విద్యుద్దీపాల వెలుగులు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం బూరుగుపల్లి (తెలంగాణ అడ్డా స్టాఫ్ రిపోర్టర్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు బూరుగుపల్లి గ్రామంలోని విజయ్ నగర్ కాలనీలో అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కాలనీకి చెందిన మహిళలు, యువతులు, చిన్నపిల్లలు సంప్రదాయ పట్టువస్త్రాలు ధరించి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా, ఆకర్షణీయంగా పేర్చిన బతుకమ్మలను కాలనీ కూడలిలో ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో" అంటూ మహిళలు...